- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్ల సముద్రం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు.. భారత విదేశాంగ శాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ
‘బ్లాక్ సీ’ ప్రాంతంలో నౌకలపై డ్రోన్లు, క్షిపణి దాడుల భయం పెరిగిన నేపథ్యంలో విదేశాంగ శాఖ భారత పౌరులు, నావికులకు కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత పౌరులకు తాజాగా విదేశాంగ శాఖ కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. నల్లసముద్రం (Black Sea)తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధం, ఘర్షణల నేపథ్యంలో అక్కడ ప్రయాణించే పౌరులు, పనిచేసే వ్యాపార నౌకలు (Commercial Vessels) అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అయితే, తాజాగా నల్ల సముద్రంలో ప్రయాణించే సరుకు రవాణా నౌకలపై క్షిపణులు, డ్రోన్ల దాడులు పెరిగాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెల నుంచి ఈ తరహా దాడుల తీవ్రత మరింత ఎక్కువైంది. ఈ దురదృష్టకర ఘటనల్లో ఇప్పటి వరకు ఐదుగురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశాంగ శాఖ వెల్లడించింది.
‘బ్లాక్ సీ’ ప్రాంతంలో నడిచే నౌకల్లో ఉద్యోగాలు పొందాలనుకునే భారతీయ నావికులు అక్కడ ఉండే ప్రమాదాలను క్షుణ్ణంగా అంచనా వేసుకోవాలని సూచించింది. భద్రతా ఏర్పాట్లు, ఇన్సూరెన్స్ పరిహారం, అత్యవసర సమయాల్లో అనుసరించాల్సిన పద్ధతులు, ఉద్యోగ నియమ నిబంధనలను ముందే క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని స్పష్టం చేసింది. నౌకలపై ఉన్న భారతీయులు తమ కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని, ఓడ యాజమాన్యం ఇచ్చే భద్రతా ఆదేశాలను తప్పక పాటించాలని, అదేవిధంగా భారత విదేశాంగ శాఖ జారీ చేసే హెచ్చరికలను నిశితంగా గమనిస్తూ ఉండాలని కోరింది.






