చిరుతను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం

by Jakkula.Mamatha |

రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందిన ఘటన హవేలీ ఘనపూర్ మండలం గంగాపూర్ శివారులో ఆదివారం జరిగింది.

చిరుతను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం
X

దిశ, మెదక్ ప్రతినిధి: రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందిన ఘటన హవేలీ ఘనపూర్ మండలం గంగాపూర్ శివారులో ఆదివారం జరిగింది. మెదక్ రామాయంపేట ప్రధాన రహదారి పై రక్తపు మడుగులో పడి ఉన్న చిరుతను గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు మృతి చెందిన చిరుతను గుర్తించారు. రక్తపు మడుగులో చిరుత ఉండడంతో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడం వల్లే మృతి చెందినట్లు భావిస్తున్నారు. రోడ్డు దాటుతున్న తరుణంలో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Next Story