- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐకానిక్ థ్రిల్లర్ సీక్వెల్‌లోకి యామీ గౌతమ్ ఎంట్రీ.. ‘కహానీ-3’లో పవర్ ఫుల్ రోల్!
ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా రాబోతున్న ‘కహానీ 3’లో హీరోయిన్‌గా యమీ గౌతమ్‌ను మేకర్స్ ఎంపిక చేసుకున్నట్లు టాక్.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ బ్యూటీ యామీ గౌతమ్ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇటీవల ‘ఆర్టికల్ 370’ చిత్రంలో ఆమె చూపించిన పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ఏకంగా నేషనల్ అవార్డ్ లభించడం విశేషం. ఇక గత ఏడాది యామీ ప్రధాన పాత్రలో నటించిన ‘హక్’ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ప్రస్తుతం కథా బలమున్న పాత్రలను ఎంచుకుంటూ, సినిమాను తన భుజాలపై నడిపించే సత్తా ఉన్న అరుదైన హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన యామీ గౌతమ్ ఖాతాలో మరొక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేరినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ ఐకానిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కహానీ' ఫ్రాంచైజ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
గతంలో విద్యా బాలన్ నటించిన ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా రాబోతున్న ‘కహానీ 3’లో హీరోయిన్‌గా యమీ గౌతమ్‌ను మేకర్స్ ఎంపిక చేసుకున్నట్లు టాక్. అయితే మొదటి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన మాస్టర్ మైండ్ డైరెక్టర్ సుజోయ్ ఘోష్‌యే ఈ ఐకానిక్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. యామీ గౌతమ్ పవర్ ఫుల్ నటన, సుజోయ్ ఘోష్ మార్క్ మేకింగ్ కలిపి ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సరికొత్త కథతో 'కహానీ-3’ ఇది పాత కథకు కొనసాగింపు కాకుండా, కేవలం ఆ థ్రిల్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతోంది. ఇందులో యమీ గౌతమ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.






