ఆస్పత్రిలో వైఎస్ షర్మిల.. ఏం జరిగిందంటే?

by Ajay Maddhiboyina |

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆస్పత్రిలో చేరారు. తనకు కడుపుకు సంబంధించిన సర్జరీ జరిగిందని, ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల సర్జరీ జరగ్గా ప్రస్తుతం కోలుకుంటున్నట్టు పేర్కొన్నారు.

ఆస్పత్రిలో వైఎస్ షర్మిల.. ఏం జరిగిందంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆస్పత్రిలో చేరారు. తనకు కడుపుకు సంబంధించిన సర్జరీ జరిగిందని, ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల సర్జరీ జరగ్గా ప్రస్తుతం కోలుకుంటున్నట్టు పేర్కొన్నారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నవారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఫోటోలో ష‌ర్మిల ముఖానికి ఆక్సీజ‌న్ పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే ఏ సర్జ‌రీ జ‌రిగింది అనేది ఆమె వెల్ల‌డించలేదు. మ‌రోవైపు ఆమె సోష‌ల్ మీడియాకు, పార్టీ కార్య‌క్ర‌మాలకు దూరంగా ఉంటున్నారు. రీసెంట్ గా ఏపీలో నీట్ పేప‌ర్ లీకేజీపై ఏపీలో చేప‌ట్టిన ఆందోళ‌న‌లోనూ ఆమె క‌నిపించ‌లేదు. దీంతో ష‌ర్మిల క‌నిపించ‌డంలేద‌ని అంతా అనుకున్నారు. ఇక తాజాగా తాను ఆస్ప‌త్రిలో ష‌ర్మిల ప్ర‌క‌టించారు. దీంతో ఆమె త్వ‌ర‌లో కోలుకోవాల‌ని అభిమానులు, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు. ఇక రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే ష‌ర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపికైన త‌ర‌వాత పార్టీలో కొంత జోష్ పెరిగిన సంగ‌తి తెలిసిందే.

Next Story