- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న కిరణ్ అబ్బవరం.. చాలా సర్‌ప్రైజ్ అవుతారంటూ కామెంట్స్
నేను చేస్తున్న ఈ వెబ్ సిరీస్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇది చూశాక ప్రేక్షకులంతా కచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతారు.

దిశ, సినిమా: ‘క’ సినిమాతో బాక్సాఫీసును షేక్ చేసి తన పాపులారిటీ పెంచుకున్న కిరణ్ అబ్బవరం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక ఇటీవల ఆయన నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ థియేటర్స్‌లోకి వచ్చి ప్రేక్షకులను కన్నీరు పెట్టించడంతో పాటు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. వెండితెరపై వరుస హిట్లతో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న ఈ క్రేజీ వెబ్ సిరీస్‌కి ‘గువ్వల చెరువు ఘాట్’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు. రాయలసీమ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పగ, ప్రతీకారాలు, విలేజ్ రాజకీయం వంటి పవర్ ఫుల్ అంశాలతో నిండిన యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కుతోంది.
భరత్ కమ్మా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ వెంచర్‌ను డ్రీమ్ ఫార్మర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు బాపినీడు, సుధీర్ ఈదర అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ప్రైమ్'లో ఇది విడుదల కానుంది. ఈ సిరీస్‌లో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, తిరువీర్, తేజస్వీ రావు, సిద్ధిక్, అడుకలం నరేన్, వినోద్ కిషన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం ఈ ప్రాజెక్ట్ విశేషాలు పంచుకుంటూ.. "నేను చేస్తున్న ఈ వెబ్ సిరీస్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇది చూశాక ప్రేక్షకులంతా కచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతారు. భరత్ కమ్మాతో వర్క్ చేయడం మంచి అనుభూతిని ఇచ్చింది. ఇది అమెజాన్‌లో వస్తున్న ఒక బిగ్గెస్ట్ వెబ్ సిరీస్. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయింది, మరో పది రోజుల్లో ముగుస్తుంది" అని తెలిపారు.






