పెళ్లైన 12 ఏళ్లకు తల్లి అయిన టాలీవుడ్ హీరోయిన్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

పెళ్లైన 12 ఏళ్లకు తల్లి అయిన టాలీవుడ్ హీరోయిన్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: పద్యప్రియ జానకీరామన్ 2004లో శీను వాసంతి లక్ష్మి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగులో అందరి బంధువయా. పటేల్ సార్ వంటి చిత్రాల్లో నటించిన ఈ భామ మంచి గుర్తింపు రాబట్టుకున్నారు. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విలక్షణ పాత్రలు పోషించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనకు గానూ నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే, 2014లో గుజరాత్‌కు చెందిన జాస్మిన్ షాను ముంబైలో ప్రేమవివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తన వయస్సుకు తగ్గ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు.

గత ఏడాది యువ సస్నాన్ కా సఫర్, డియర్ వంటి చిత్రాల్లో కనిపించిన ఆమె, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు.తాజాగా పద్మప్రియ తన అభిమానులకు ఒక ఊహించని సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బిడ్డ చిన్నారి చేతులను పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు తన ప్రెగ్నెన్సీ విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచడంతో, సడెన్‌గా ఈ పిక్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే తనకు పుట్టింది ఆడబిడ్డా లేక మగబిడ్డా అనే విషయాన్ని మాత్రం ఆమె ఇంకా రివీల్ చేయలేదు. పెళ్లైన 12 ఏళ్లకు, 46 ఏళ్ల వయసులో తల్లికావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story