మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డికి గుండెపోటు.. పరిస్థితి అత్యంత విషమం

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-26 05:12:44  IST  )

నరసంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డికి గుండెపోటు.. పరిస్థితి అత్యంత విషమం
X

దిశ, వె‌బ్‌డెస్క్/నర్సంపేట: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి హన్మకొండ హంటర్ రోడ్డులోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూ (ICU) విభాగంలో ఆయనకు సీపీఆర్‌తో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, మాజీ ఎమ్మెల్యే అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు రోహిణి ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. మాజీ హరీశ్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన హనుమకొండకు బయలుదేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక హెల్త్ బులెటిన్ కోసం కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.

Next Story