- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం తీసిన మోటార్.. కోయవాగు గ్రామంలో విషాదం
వాటర్ మోటార్ ఓ వృద్ధుడి ప్రాణం తీసింది.

X
దిశ, ఆసిఫాబాద్: వాటర్ మోటార్ ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కోయవాగు గ్రామానికి చెందిన చిట్యాల కేదారి(60) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి సమీపంలోని బావి వద్ద మంచినీరు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మోటార్‌తో విద్యుత్ షాక్‌కు గురైన కేదారిని కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






