- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మూవీ హిట్ అయిన తర్వాత ఇప్పుడు నా డ్రీమ్ రోల్స్ దక్కుతున్నాయి: అదా శర్మ
బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద హిట్ పడితే, ఇండస్ట్రీలో పెద్ద ప్రాజెక్టులు చేసే మేకర్స్ మీపై మరింత నమ్మకం ఉంచుతారనే విషయాన్ని తాను గ్రహించానని అదా తెలిపారు.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అదా శర్మ ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ‘బస్తర్ ది నక్సల్ స్టోరీ’ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక ఇటీవల ‘గవర్నర్’తో మెప్పించిన ఆమె ప్రస్తుతం ‘గజ్రా’అనే చిత్రంతో మరాఠీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రేయాస్ జాదవ్ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుండగా.. ప్రస్తుతం అదా శర్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అదా శర్మ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, సినిమాల ఎంపికపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ది కేరళ స్టోరీ’ లాంటి పెద్ద హిట్ తర్వాత మంచి పాత్రల కొరత ఏమైనా ఎదురైందా అని యాంకర్ ప్రశ్నించగా... అదా శర్మ స్పందిస్తూ.. బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద హిట్ పడితే, ఇండస్ట్రీలో పెద్ద ప్రాజెక్టులు చేసే మేకర్స్ మీపై మరింత నమ్మకం ఉంచుతారనే విషయాన్ని తాను గ్రహించానని అదా తెలిపారు. 'ది కేరళ స్టోరీ' తర్వాత తనకి మునుపటి కంటే మెరుగైన, గొప్ప అవకాశాలు లభించాయని వెల్లడించారు. ఒక నటిగా ప్రతీ ఒక్కరూ కోరుకునే సవాలుతో కూడిన పాత్రలు, కథలో ఊహించని మలుపులు ఉండే రోల్స్, అలాగే ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉండే క్యారెక్టర్లు ఇప్పుడు తనను వెతుక్కుంటూ వస్తున్నాయని.. తన డ్రీమ్ రోల్స్ దక్కుతున్నాయని అదా శర్మ సంతోషం వ్యక్తం చేశారు.






