బడా భీంగల్‌లో వైభవంగా వల గొడుగు ఊరేగింపు.. సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు

by Jakkula.Mamatha |

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడా భీంగల్‌లో ఆదివారం వల గొడుగు ఊరేగింపు వేడుక భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది.

బడా భీంగల్‌లో వైభవంగా వల గొడుగు ఊరేగింపు.. సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు
X

దిశ, భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడా భీంగల్‌లో ఆదివారం వల గొడుగు ఊరేగింపు వేడుక భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది. గ్రామానికి చెందిన మత్స్యకారులు (బోయ కులస్తులు) తమ సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో ముందు నడవగా, డప్పు దరువులు, ఆనందోత్సాహాల నడుమ ఊరేగింపు కంటికింపుగా సాగింది. ఈ సందర్భంగా బోయ సంఘం ప్రతినిధులు భూమేశ్వర్, అనిల్, పోచయ్య, గంగాధర్ మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులన్నీ జలకళతో నిండాలని, పంటలు బాగా పండి అందరికీ మంచి జరగాలని, అలాగే చేపల వేట ఆశాజనకంగా సాగాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజలు, ఊరేగింపు నిర్వహించినట్లు తెలిపారు.

Next Story