- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. 35 మంది మృతి
రియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 మంది మరణించారు. డమాస్కస్ -డెయిర్ ఎజోర్ రహదారిపై భద్రతా దళాల బస్సు, ప్రయాణికుల బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: సిరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 మంది మరణించారు. డమాస్కస్ -డెయిర్ ఎజోర్ రహదారిపై భద్రతా దళాల బస్సు, ప్రయాణికుల బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 35కు చేరుకోగా, మరో 30మంది గాయపడ్డారు. సిరియాలో ఏళ్ల తరబడి సాగుతున్న అంతర్యుద్దం, నిర్లక్ష్యం కారణంగా రహదారులు శిథిలావస్థకు చేరుకోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈనెల ప్రారంభంలో దక్షిణ సినియాలోని దారా ప్రావిన్స్ లో సౌదీ అరేబియా నుండి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సు రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. పదిమందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి అతివేగమే కారణం అని అధికారులు వెల్లడించారు. దీనికంటే ముందు ఈశాన్య సిరియాలో ఓ బస్సు చమురు ట్యాంకర్ ను ఢీకొట్టడతో 12 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. సంవత్సరాల తరబడి జరుగుతున్న అంత్యర్యుద్ధం , రోడ్లను నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. రోడ్లను బాగుచేయాలని ప్రజల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి.






