బ్రతకడం కోసం ఒప్పుకునే రోజులు పోయాయి.. భయపడే ప్రసక్తి లేదంటూ త్రిప్తి షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

‘యానిమల్’ చిత్రం సాధించిన అపారమైన విజయం తర్వాత తనకి ఎంతో స్వేచ్ఛ వచ్చినట్లు అనిపించిందని త్రిప్తి తెలిపారు.

బ్రతకడం కోసం ఒప్పుకునే రోజులు పోయాయి.. భయపడే ప్రసక్తి లేదంటూ త్రిప్తి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ‘యానిమల్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి తనదైన నటనతో చెరగని ముద్ర వేసుకున్నారు. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను రాబట్టుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంతో పాటు బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, స్టార్‌డమ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘యానిమల్’ చిత్రం సాధించిన అపారమైన విజయం తర్వాత తనకి ఎంతో స్వేచ్ఛ వచ్చినట్లు అనిపించిందని త్రిప్తి తెలిపారు. ఆ సినిమాకి ముందు తనలోని ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశాల కోసం నిరంతరం ఎదురుచూశానని, అయితే ఇప్పుడు ఇండస్ట్రీకి తనపై పూర్తి నమ్మకం ఏర్పడిందని అన్నారు.

కేవలం అవకాశాల కోసం కాకుండా, తనకు నచ్చిన కథలనే ఎంచుకునే వెసులుబాటు లభించిందని చెప్పారు. తనకు ఎలాంటి సినీ నేపథ్యం లేకపోవడం కూడా ఒక రకంగా కలిసొచ్చిందని, అది తనను ఎప్పుడూ నేలమీద ఉండేలా చేస్తుందని స్పష్టం చేశారు. భయంతోనో లేదా బ్రతకడం కోసం అవును అని చెప్పే బదులు, ఇప్పుడు నన్ను నిజంగా ఉత్తేజపరిచే కథల కోసం వేచి ఉండగలుగుతున్నా అని అన్నారు. భయపడే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు. ఇది తన కెరీర్ పట్ల తనకున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపారు. మొదట్లో ఈ స్టార్‌డమ్ కాస్త భారంగా, ఇబ్బందిగా అనిపించిందని.. కానీ ఆ తర్వాత ప్రజల అభిప్రాయాలను, వాస్తవాలను వేరు చేసి చూడటం అలవాటు చేసుకున్నా అని త్రిప్తి వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొంతమంది మాత్రం ‘స్పిరిట్’ అప్డేట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Next Story