పాన్ ఇండియా పేరు చెప్పి వస్తే ఒప్పుకోను.. డైరెక్టర్లకు మాళవిక మోహనన్ మాస్ వార్నింగ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-26 05:16:02  IST  )

మన ఇండస్ట్రీలో మహిళా డైరెక్టర్లు, రైటర్లు చాలా తక్కువమంది ఉన్నారని మాళవిక అన్నారు. మహిళల ఆలోచనా కోణంలో కథలు వచ్చినప్పుడే మంచి మార్పు వస్తుందని చెప్పారు.

పాన్ ఇండియా పేరు చెప్పి వస్తే ఒప్పుకోను.. డైరెక్టర్లకు మాళవిక మోహనన్ మాస్ వార్నింగ్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి భారీ క్రేజ్ రాబట్టుకున్నారు. గత ఏడాది ‘హృదయపూర్వం’తో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం సర్దార్-2, పాకెట్ నావల్ వంటి భారీ ప్రాజెక్ట్స్‌లో స్టార్ హీరోల సరసన నటించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఇండస్ట్రీలో మార్పులపై ఆసక్తికర కామెంట్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమాల్లో ఆడవాళ్ల పాత్రలు మరింత పవర్‌ఫుల్‌గా మారాలంటే.. కేవలం హీరోయిన్లు మారితే సరిపోదని, కథలు రాసే రచయితలు, డైరెక్టర్లలో కూడా మహిళలు ఎక్కువగా రావాలని హీరోయిన్ మాళవిక మోహనన్ అభిప్రాయపడ్డారు. అలాగే తన కెరీర్, సినిమాల ఎంపిక గురించి చాలా విషయాలు పంచుకున్నారు. మన ఇండస్ట్రీలో ఆడ డైరెక్టర్లు, రైటర్లు చాలా తక్కువమంది ఉన్నారని మాళవిక అన్నారు. మహిళల ఆలోచనా కోణంలో కథలు వచ్చినప్పుడే మంచి మార్పు వస్తుందని చెప్పారు.

భవిష్యత్తులో మన దగ్గర కూడా హాలీవుడ్ ‘కిల్ బిల్’ లాంటి భారీ యాక్షన్ సినిమాలు వస్తాయని చెప్పారు. ఇకపై తాను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాబోనని తెగేసి చెప్పారు. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం అలాంటి రోల్స్ చేసినా, ఇప్పుడు మాత్రం నటనకు ప్రాధాన్యం ఉన్న కథలనే ఒప్పుకుంటున్నట్లు తెలిపారు. మంచి కథ లేకుండా, కేవలం పాన్ ఇండియా అనే ట్యాగ్ వేసుకుని మార్కెటింగ్ ప్లాన్లతో వచ్చే ప్రాజెక్ట్‌లను ఒప్పుకోనని హెచ్చరించారు. ముందు కథ బాగుండాలి, ఆ తర్వాతే మార్కెటింగ్ అని స్పష్టం చేశారు. ఇక బాలీవుడ్ ప్రస్తుతం ఒక మార్పు దశ గుండా వెళ్తోందని, మంచి రోజులు రావడానికే ఈ పరిస్థితి అని అన్నారు. అలాగే తమిళ, తెలుగు పరిశ్రమల్లో ఉన్నట్లు తక్కువ రోజుల్లో షూటింగ్‌లు పూర్తిచేసి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఇచ్చే పద్ధతి పరిశ్రమ అంతటా రావాలని కోరారు. ఇండస్ట్రీలోకి వచ్చే యువతులకు సలహా ఇస్తూ... ఇక్కడ సహనం, మొండిధైర్యం చాలా అవసరమని, గెలుపు కంటే ఓటములే ఎక్కువగా ఉంటాయని, కానీ సాధించే విజయం ఆ కష్టాన్నంతా మర్చిపోయేలా చేస్తుందని చెప్పారు. ఈ కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.

Next Story