- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేతనైతే GHMCకి ‘జెన్ జీ’ని మేయర్‌ను చెయ్.. సీఎంకు ఎంపీ రఘునందన్ కౌంటర్
'జెన్ జీ' రాజకీయాలు, వయోపరిమితి తగ్గింపుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘జెన్ జీ’ ఆశయాలకు అనుగుణంగా యువత చట్టసభల్లో అడుగుపెట్టడానికి వీలుగా శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21కి తగ్గించాలని సీఎ రేవంత్ రెడ్డి (Revanth Reddy) డిమాండ్ చేశారు. శనివారం రాత్రి ఆయన హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అదేవిధంగా తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ‘జెన్ జీ’కి విద్యాశాఖ బాధ్యతలు కట్టబెడుతామని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం వ్యాఖ్యలకు ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.
ఓ యువ ఎమ్మెల్యేకు విద్యాశాఖ ఇవ్వు..
ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో జరగని, సాధ్యం కాని వాటిపై సీఎం మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. 56 ఏళ్ల రాహుల్ గాంధీకి ప్రధాని పదవి కనుచూపుమేరలో కూడా లేదని కామెంట్ చేశారు. ‘జెన్ జీ’కి రేవంత్ రెడ్డి అంత ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే తన పార్టీలో ఓ యువ ఎమ్మెల్యేకు విద్యాశాఖను ఇవ్వాలని అన్నారు. చేతనైతే జీహెచ్ఎంసీకి ‘జెన్ జీ’ మేయర్‌ను చేయండి అంటూ సవాల్ విసిరారు. రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించి వయో పరిమితిపై చర్చించాల్సి వస్తే తప్పకుండా పార్లమెంట్ సరైన వేదిక అని రఘునందన్ రావు అన్నారు.
ఉపన్యాసాలు, క్యాండిల్ ర్యాలీలా..
నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కనీసం పదో తరగతి పరీక్ష నిర్వహించడం చేతకాలేదని రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. అలాంటిది నేడు ట్యాంక్‌బండ్ మీదకు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చుడు, క్యాండిల్ ర్యాలీ అని పార్టీ కార్యక్రమాలు నిర్వహించుడు హస్యాస్పదమని అన్నారు. ‘నీట్’ పరిక్షలో తప్పు జరిగిందని గ్రహించామని, అందుకు రీ-ఎగ్జామ్ కూడా నిర్వహించి దిద్దుబాటు చర్యలు చేపట్టి యవత ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లామని రఘునందర్ రావు తెలిపారు.






