- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారనున్న జిల్లా రూపురేఖలు
సింగరేణి సంస్థ చరిత్రలోనే అతిపెద్ద గనిగా పేరొందిన తాడిచెర్ల-2 గని ప్రారంభమైతే జిల్లా రూపురేఖలు మారనున్నాయి.

దిశ,భూపాలపల్లి ప్రతినిధి/మల్హర్: సింగరేణి సంస్థ చరిత్రలోనే అతిపెద్ద గనిగా పేరొందిన తాడిచెర్ల-2 గని ప్రారంభమైతే జిల్లా రూపురేఖలు మారనున్నాయి. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని సాత్రాజు పల్లిలో ప్రారంభం కానున్న ఈ గనిలో అత్యంత నాణ్యమైన బొగ్గు ఉన్నట్లు సింగరేణి అధికారులు చెబుతున్నారు. 1991లో తాడిచెర్ల-1 బొగ్గు గని ప్రారంభంగా దానిని ఏఎంఆర్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఈ ప్రాంతంలో చాలా మందికి శాశ్వత ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. భూపాలపల్లి తాడిచెర్ల -1లో బొగ్గు తీయడం ప్రారంభం కాగానే భూపాలపల్లి జిల్లాలో చెల్పూర్ వద్ద 1100 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. వేలాది మందికి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించారు. తాటిచెర్లలో 2బొగ్గు గని ప్రారంభమైతే 1082 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కానుంది. 16 పొరలలో ఉన్న ఈ బొగ్గు రకం జి8గా సింగరేణి అధికారులు గుర్తించారు. బొగ్గు గని ప్రారంభమైతే 1550 హెక్టార్ల భూమిని సింగరేణి స్వాధీనం చేసుకొనుంది. ఇందులో 1300 హెక్టార్ల ఎకరాలు అటవీ ప్రాంతం కాగా 250 హెక్టార్ల ఎకరాలు రైతులు సాగు చేస్తున్న భూమిగా సింగరేణి అధికారులు గుర్తించారు.
సింగరేణి గని ప్రారంభం కావడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉంది. అంతేగాక భూములు కోల్పోతున్న 250 హెక్టార్ల భూమి కలిగి ఉన్న రైతులకు పరిహారం చెల్లింపునకు ప్రక్రియ ప్రారంభించారు. సింగరేణి ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చి బొగ్గు వెలికితీత పనులు విషయం పై చర్చిస్తున్నారు. బొగ్గు భౌగోళిక విషయం 7.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తాడిచెర్ల టు గని ప్రారంభమైతే సుమారు 2000 మందికి ఉద్యోగాలు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు పదివేల మందికి ఉద్యోగ వ్యాపార అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఎనిమిది వందల మెగా వాట్ల యూనిట్ విద్యుత్ ఉత్పత్తి మానేరు నది వద్ద ప్రారంభిస్తే మరో అయిదు వేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తాడిచెర్ల టుని సింగరేణి అప్పగించడంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మల్హర్ మండలంలో బొగ్గు గనులు ప్రారంభించడం వల్ల ఎంతో మందికి ఉపాధి కల్పించడంతో పాటు చాలా మందికి ఉద్యోగ అవకాశాలు దొరికి ఆ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది. రెండవ గని ప్రారంభమైతే మలహర్ మండలంలోని తాడిచెర్ల భూపాల్ పల్లి జిల్లా కేంద్రమునకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో భూపాలపల్లి జిల్లాతో పాటు చుట్టుపక్కల మండలాలైన కాటారం, మహాదేవపూర్ మండలాల్లో వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. భూమి కోల్పోతున్న భూ నిర్వాసితులు తరలివచ్చి భూపాలపల్లి, కాటారం మండలంలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి:కటకం మధుకర్ రెడ్డి
సాత్రాజ్ పల్లిలో తాతముత్తాతల నుంచి నివాసం ఉంటున్నాం. మా గ్రామాన్ని తీసుకుంటే స్థానికులు అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రణాళికలు ఉండాలి. స్థానికులు అందరికీ పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించాలి: ఎస్ రమణారెడ్డి
ఓసీపీ-2 గనిలో పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించాలి. ఇండ్ల నష్టపరిహారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళిక పగడ్బందీగా ఉండాలి.






