చిత్రపరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-10 02:42:21  IST  )

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ భార‌తీరాజా 84 క‌న్నుమూశారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న బుధ‌వారం తెల్ల‌వారుజామున మృతి చెందారు.

చిత్రపరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ భార‌తీరాజా (84) క‌న్నుమూశారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న బుధ‌వారం తెల్ల‌వారుజామున మృతి చెందారు. 1941 జూలై 17న ఈయ‌న జ‌న్మించారు. 16 వయత్తినిలే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తరవాత తమిళ్ లో కిజక్కే పోగుమ్ రైలు, సిగప్పు రోజక్కల్ తోపాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. త‌మిళ ద‌ర్శ‌కుడు అయినప్ప‌టికీ కొత్త జీవితాలు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఆ త‌ర‌వాత తెలుగులో సీతాకోక‌చిలుక‌, ఆరాధ‌న‌, జ‌మ‌ద‌గ్ని లాంటి సూప‌ర్ హిట్ సినిమాలు తీశారు. భార‌తీరాజా ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన సీతాకోక‌చిలుక సినిమాకు నంది అవార్డు వ‌చ్చింది. మట్టివాసనను టాలీవుడ్ కు పరిచయం చేసింది కూడా భారతీరాజానే. 2004లో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఈయ‌న సేవ‌ల‌కు గానూ ప‌ద్మ‌శ్రీ అవార్డు వ‌రించింది. సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మే కాకుండా న‌టుడిగానూ త‌మిళ‌చిత్ర‌సీమ‌లో దాదాపు 20 సినిమాల్లో క‌నిపించారు. 2013 వరకు దర్శకుడిగానే సినిమాలు తీయగా ఆ తరవాత నటుడిగా ఆకట్టుకున్నారు. చివ‌ర‌గా ద‌నుష్ హీరోగా న‌టించిన వాతీ అనే చిత్రంలో న‌టించారు. ఈ సినిమాలో ధ‌నుష్ కు తాత‌గా న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్నారు. భారతీరాజా మృతిపై తమిళ సినిమా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Next Story