బారామతి విమాన ప్రమాదం: ఘటనా స్థలంలో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-29 05:22:07  IST  )

బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

బారామతి విమాన ప్రమాదం: ఘటనా స్థలంలో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి విదిప్ జాదవ్, సహాయకురాలు పింకీ మాలి, ఇద్దరు పైలట్లు మొత్తం ఐదుగురు మరణించారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా ప్రమాదంపై ఈ రోజ (గురువారం) ఉదయం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టాయి. పుణె రూరల్ పోలీసులు ఈ ఘటనపై 'ప్రమాదవశాత్తు మరణం' (ADR) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంపై ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. సమగ్ర విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

Similar News : పవార్ సతీమణి చేతికి ఎన్సీపీ? తొలిసారి చక్రం తిప్పనున్న మహిళ?

Next Story