- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ ఘటన: ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాబు మోహన్‌కు ఘోర అవమానం
దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చిన అభిమానులను లోపలికి వెళ్లకుండా పోలీసులు, భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ స్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చిన అభిమానులను లోపలికి వెళ్లకుండా పోలీసులు, భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న సీనియర్ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ పరిస్థితిని చక్కదిద్దేందుకు, అభిమానులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే, ఆవేశంతో ఉన్న కొందరు వ్యక్తులు బాబు మోహన్ (Babu Mohan) పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఎవరూ ఊహించని విధంగా ఆయనను వ్యక్తిగతంగా దూషిస్తూ, కించపరిచేలా మాట్లాడటంతో అక్కడున్నవారంతా విస్మయానికి గురయ్యారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీడీపీ కార్యకర్తలు, అభిమానుల మధ్య సమన్వయం చేసేందుకు ప్రయత్నించిన ఒక సీనియర్ నేతను, ఒక దళిత నాయకుడిని ఇలా కులపరంగా, వ్యక్తిగతంగా కించపరచడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. "ఒక సీనియర్ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా?" అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. మహనీయుడైన ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా, ఇలాంటి వివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
READ MORE ....
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాబుమోహన్, మోత్కుపల్లి






