ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాబుమోహన్, మోత్కుపల్లి

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-18 09:57:39  IST  )

నందమూరి తారక రామారావు వర్ధంతి నేపథ్యంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటుడు రాజకీయ నాయకుడు బాబు మోహన్, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాబుమోహన్, మోత్కుపల్లి
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి తారక రామారావు వర్ధంతి నేపథ్యంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటుడు రాజకీయ నాయకుడు బాబు మోహన్, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తన దేవుడు అని అన్నారు. తనను ఎన్టీఆర్ తమ్ముడు అని సంభోదించేవాడని చెప్పారు. ఆయన పరమవదించారు అని చెప్పడానికి కూడా నోరు రాదన్నారు. భూమి ఉన్నంత వరకు ఎన్టీఆర్ బతికే ఉంటారన్నారు.

ఆయన మళ్లీ పుట్టి నటుడుగా ఓ వెలుగు వెలగాలని అన్నారు. ఎన్టీఆర్ తిరిగి వస్తాడని తాను నమ్ముతానని చెప్పారు. ఆయన శకపురుషుడని వ్యాఖ్యానించారు. మోత్కుపల్లి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఎన్ని ఏళ్లు అయినా ప్రజల గుండెల్లో జీవించే ఉంటారని వ్యాఖ్యానించారు. పేదవాడి ఆకలిని గుర్తించిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన గతంలో ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికీ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రులు మారినా పథకాలు మారడం లేదన్నారు. మరణించి వంద సంవత్సాలు అయినా ఆయన జీవించి ఉన్నట్టే అని చెప్పారు.

READ MORE ....

షాకింగ్ ఘటన: ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాబు మోహన్‌కు ఘోర అవమానం

Next Story