- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AUSW vs INDW: మెరిసిన మంధాన, రోడ్రిగ్స్.. ఆస్ట్రేలియాపై భారత్ భారీ స్కోరు
ఆస్ట్రేలియాపై భారత మహిళల జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు. మంధాన (82), జెమిమా(59)తొ రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 176 పరుగుల భారీ స్కోరును నమోదు చేసి ఆసీస్ ముందు కఠిన లక్ష్యాన్ని ఉంచింది.

దిశ, వెబ్ డెస్క్: టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈ రోజు మూడో టీ20 మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఈ కీలక మ్యాచ్‌లో ఓపెనర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన కేవలం 55 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచింది. ఆమెకు తోడుగా జెమిమా రోడ్రిగ్స్ (46 బంతుల్లో 59 పరుగులు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. చివరిలో రిచా ఘోష్ కేవలం 7 బంతుల్లోనే 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 (స్ట్రైక్ రేట్ 257.14) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్ రెండు వికెట్లు తీయగా, కిమ్ గార్త్, సోఫీ మోలినెక్స్ తలో వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచులో ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులు చేయాల్సి ఉంది. ఈ భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియాను భారత బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ వంటి కీలక బౌలర్ల ప్రదర్శనపైనే ఇప్పుడు భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.






