- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Deepika Padukone: కాంట్రవర్సీ బ్యూటీని నా లక్కీ చార్మ్ అంటూ అట్లీ షాకింగ్ కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (Atlee)కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (Atlee)కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ‘AA-22’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో ఐకాన్ స్టార్ సరసన దీపికా పదుకొణె(Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తోంది. తల్లి అయిన తర్వాత దీపికా ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఇటీవల కాంట్రవర్సీ బ్యూటీగా మారిన దీపికాను భారీ ప్రాజెక్ట్స్ నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అట్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల పనిగంటల విషయంలో వివాదాలు ఎదుర్కొన్న దీపికాను అట్లీ వెనకేసుకొచ్చారు. ‘‘దీపికా నాకు అదృష్ట దేవత . మాతృత్వం తర్వాత ఆమె రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో మీరు ఒక కొత్త దీపికను చూస్తారు. ఆమె ఒక అద్భుతమైన నటి’’ అంటూ ప్రశంసలు కురిపించారు. వివాదాల కారణంగా ఆమెను ప్రాజెక్టుల నుండి తొలగిస్తున్నారనే వార్తలకు అట్లీ మాటలతో చెక్ పడినట్లయింది. ఇక సినిమా అప్‌డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్‌కు అట్లీ ఒక ప్రామిస్ చేశారు. ‘‘ఈ సినిమా కోసం మేమంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం.
ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని కనుగొంటున్నాం. ప్రేక్షకులకు అన్నీ చెప్పాలని నాకూ ఆత్రుతగా ఉంది. కానీ సరైన సమయం కోసం చూస్తున్నాం. ఎలాంటి సాకులు చెప్పం.. కేవలం స్వచ్ఛమైన కష్టం, ప్యాషన్‌తో మీకోసం ఒక భారీ విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నాం’’ అని అట్లీ ధీమా వ్యక్తం చేశారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అట్లీ మాటలను బట్టి అర్థమవుతోంది.






