Perni Nani: భద్రాచలంపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..

by Disha Web Desk 19 |
MLA Perni Nani Comments On Bhadrachalam
X

దిశ, వెబ్‌డెస్క్: MLA Perni Nani Comments On Bhadrachalam| పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు విషయంలో ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పోలవరం కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణలో భద్రాద్రికి ముప్పు అని తెలంగాణ నేతలు వాదిస్తుండగా.. అన్ని నియమ నిబంధనలకు కట్టుబడే పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామని ఏపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ఈ అంశంపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రిపై తెలంగాణ ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రిని నిర్మించినట్లే.. భదాద్రికి ఎందుకు నిధులిచ్చి అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణకు భద్రాద్రిపై ప్రేమ లేకుంటే.. ఏపీకి ఇచ్చేయండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. పోలవరం డ్యామ్‌తో భద్రాచలం మునగడమనేది హాస్యాస్పదమని అన్నారు. తెలంగాణలో ఎన్నికలు వస్తునందునే ఆంధ్రా సెగ రాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ వాళ్లే ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed