ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

by Vinod kumar |

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై - Central government key comments on special status of AP

ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో చెప్పినట్లే ఈసారి కూడా పాతపాటే పాడింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం మరోసారి ప్రకటించింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉందా లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని లోక్‌సభలో అడిగారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యత ఇవ్వలేదని.. విభజన చట్టం హామీలను చాలా వరకు నెరవేర్చామని కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు.

Next Story