- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విడుదలకు సిద్ధమైన అనుపమ పరమేశ్వరన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
టాలీవుడ్ క్యూట్ సెన్సేషన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది.

దిశ, సినిమా: టాలీవుడ్ క్యూట్ సెన్సేషన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ‘డ్రాగన్’, ‘జెఎస్కే’ వంటి చిత్రాలతో విజయాలను అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనుపమ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘లాక్ డౌన్’(Lockdown) విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. గత ఏడాదిలోనే షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ, పలు సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ, ఎట్టకేలకు ఈ నెలాఖరున ఆడియన్స్‌ను పలకరించబోతోంది.
ఏఆర్ జీవా (AR Jeeva)దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చార్లీ, ప్రియా వెంకట్, లివింగ్‌స్టన్, నిరోషా వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గత ఏడాది వచ్చిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘పరదా’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది, అందుకే ఈ ‘లాక్ డౌన్’ సినిమాపై అనుపమ భారీ ఆశలే పెట్టుకుంది. ఒక గదిలో చిక్కుకున్న యువతి ఎదుర్కొన్న ఉత్కంఠభరితమైన పరిణామాల నేపథ్యంలో ఈ థ్రిల్లర్ సాగనుంది. అనుపమ నటన ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక వరుస హిట్లతో దూసుకుపోతున్న అనుపమ ఖాతాలో ఈ సినిమా మరో విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
Read More..






