- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భగవంత్ కేసరి అంటూ దళపతి విజయ్ సినిమాపై ట్రోల్స్.. స్పందించిన అనిల్ రావిపూడి
దళపతి విజయ్ ప్రధాన పాత్రలో వస్తోన్న జన నాయగన్ చిత్రం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: దళపతి విజయ్(Thalapathy Vijay) ప్రధాన పాత్రలో వస్తోన్న జన నాయగన్ చిత్రం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సెన్సార్ కష్టాలు వచ్చిపడ్డాయి. దీంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు.. ఈ చిత్రంపై తెలుగు అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఇది బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి చిత్రం రీమేక్‌గా వస్తోందని ట్రోల్స్ చేస్తున్నారు. ట్రయిలర్ చూస్తే ఈ విషయం అందరికీ తెలిసిపోతుందని కామెంట్స్ చేశారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై భగవంత్ కేసరి చిత్రం దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) స్పందించారు. ఇటీవల ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. విజయ్ సినిమా ట్రైలర్‌లో నాలుగు సన్నివేశాలు చూసి ‘భగవంత్ కేసరి’ని రీమేక్ చేస్తున్నారని ట్రోల్స్ చేయడం సరికాదు. ‘భగవంత్ కేసరి’ కాన్సెప్ట్‌ను నచ్చి వారికి అనుగుణంగా మార్పులు చేసుకుని తీశారేమో అన్నారు. ఏదేమైనా ఇది తమిళ ప్రేక్షకులకు కొత్త సబ్జెక్ట్. అక్కడి వాళ్లు ఎవరూ భగవంత్ కేసరి చూడలేదు. కచ్చితంగా తమిళ ప్రేక్షకులకు కూడా ఆ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. విజయ్‌కి కూడా చివరి చిత్రంగా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుందని నమ్ముతున్నాను’ అని అనిల్ రావిపూడి స్పష్టత ఇచ్చారు.
READ MORE .....






