ఆ స్టార్ హీరో బంప‌ర్ ఆఫ‌ర్‌.. ముఖం మీదే నో చెప్పిన అనిల్ !

by velandi.Saikiran |   (  Updated:2026-01-11 11:47:59  IST  )

ఈ జననాయకుడు సినిమా ప్రారంభానికి అంటే ముందు, తనను దర్శకత్వం వహించాలని హీరో దళపతి విజయ్ కోరినట్లు తాజాగా అనిల్ వెల్లడించారు.

ఆ స్టార్ హీరో బంప‌ర్ ఆఫ‌ర్‌.. ముఖం మీదే నో చెప్పిన అనిల్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రేపు రిలీజ్ కానుంది. ఇవాళ సాయంత్రం ప్రీమియర్లు పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా మెరువనున్నారు. విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు విక్టరీ వెంకటేష్ పాత్ర ఉంటుందట. ఆ సమయంలో సినిమా అమాంతం హైపునకు వెళుతుందని చెబుతున్నారు.

స్టార్ హీరో ఆఫర్ రిజెక్ట్ చేసిన అనిల్ ?

మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు అనిల్. ఈ సందర్భంగా దళపతి విజయ్ నటించిన జననాయకుడు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ భగవంత్ కేసరికి రీమేక్ అని టాక్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ జననాయకుడు సినిమా ప్రారంభానికి అంటే ముందు, తనను దర్శకత్వం వహించాలని హీరో దళపతి విజయ్ కోరినట్లు తాజాగా అనిల్ వెల్లడించారు.

కానీ తాను రిజెక్ట్ చేసినట్లు ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు అనిల్. తాను రీమేక్ చేయబోవునని, ఏ సినిమా అయినా నేరుగా చేస్తానని స్పష్టం చేశారట. అటు విజయ్ కెరీర్ లో చివరి సినిమా కావడంతో కాస్త భయమేసిందని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు దర్శకుడు అనిల్. ఈ సినిమా కథ బాగా విజయ్ కి నచ్చిందని.. అందుకే బలంగా ముందుకు వెళుతున్నట్లు స్పష్టం చేశారు.

READ MORE .....

భగవంత్ కేసరి అంటూ దళపతి విజయ్ సినిమాపై ట్రోల్స్.. స్పందించిన అనిల్ రావిపూడి

Next Story