- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీపై దాడికి ప్రయత్నం.. పార్లమెంట్ నుంచి దిగ్భ్రాంతికర దృశ్యాలు
భారత పార్లమెంట్ లో ప్రధాని మోడీ పై దాడి చేసేందుకు కాంగ్రెస్ మహిళా ఎంపీలు నిరసన పేరుతో దాడికి ప్రయత్నించారని, తన వద్ద పూర్తి సమాచారం ఉందని స్పీకర్ చెప్పడం సంచలనంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: భారత పార్లమెంట్ లో ప్రధాని మోడీ (Prime Minister Modi)పై దాడి చేసేందుకు కాంగ్రెస్ మహిళా ఎంపీలు (Congress women MPs) నిరసన పేరుతో దాడికి ప్రయత్నించారని, తన వద్ద పూర్తి సమాచారం ఉందని స్పీకర్ చెప్పడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా దీనికి సంబంధించి సభలో ఆ రోజు ఎమ్ జరిగిందనే దానిపై ఒక వీడియో విడుదల అయింది. ఆ వీడియోలో కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఉద్దేశపూర్వకంగా ప్రధానమంత్రి సీటు వైపు కదులుతూ, ఇతరులకు స్పష్టమైన చేతి సంజ్ఞలతో సైగలు చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది యాదృచ్ఛికంగా జరిగినది కాదు. ఇది ఒక పక్కా ప్రణాళికతో కూడిన సమన్వయ చర్యగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ వీడియో (Viral video)లోని దృశ్యాలు అత్యంత ఆందోళనకరమైన, గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. లోక్ సభ సభ్యుల్లో ఇటువంటి ప్రవర్తన మునుపెన్నడూ లేనిది, ఇది బాధ్యతారాహిత్యమైనదని, ఇది ఆకస్మికంగా జరిగిన నిరసన కంటే, ముందే ప్లాన్ చేసిన రెచ్చగొట్టే చర్యగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తగిన ఆదేశాలు లేకుండా ఇలాంటి ప్రవర్తన సాధ్యం కాదని, కాంగ్రెస్ ఒక స్క్రిప్ట్‌ను అమలు చేస్తోందని, దీని వెనుక ఉన్నది రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వమేనని, పార్లమెంట్ అనేది రాజకీయ స్టంట్లు చేసే ఆటస్థలం కాదని విమర్శిస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి సీటు అనేది నాటకాల కోసం వాడుకునే సాధనం కాదని, సభా మర్యాదలను ఉల్లంఘించే, రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని భయపెట్టే ఏ ప్రయత్నమైనా అది ప్రజాస్వామ్యంపై జరిగే దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ పరిణామాలపై స్పీకర్ ఏ విధంగా చర్యలు తీసుకుంటారో తెలియాంటే వేచి చూడాల్సిందే.






