భారత రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-10 15:39:46  IST  )

ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

భారత రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సభలో తమకు కనీసం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇండియా (INDIA) కూటమి పార్టీలు ఇవాళ ఆయనపై అవిశ్వాస తీర్మానం నోటీసు లోక్‌సభ సెక్రటేరియట్‌కు సమర్పించాయి. ఆ నోటీసులపై 100 మందికి పైగా ఎంపీలు సంతకాలు కూడా చేశారు. సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్, స్పీకర్ ఓం బిర్లా పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు.

అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 94 (C) ప్రకారం.. స్పీకర్‌ను తొలగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టే ముందు 14 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. మరోవైపు ప్రతిపక్షాల వద్ద తగినంత సంఖ్యాబలం లేదని, ఈ తీర్మానం వీగిపోతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం, మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే పుస్తక వివాదంపై చర్చకు పట్టుబట్టిన తరుణంలో ప్రతిపక్షాలు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మాన నిర్ణయం తీసుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధాని మోడీపై దాడికి ప్రయత్నం.. పార్లమెంట్ నుంచి దిగ్భ్రాంతికర దృశ్యాలు

Next Story