రేపు అజిత్‌ పవార్‌ అంత్యక్రియలు.. హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-28 12:13:42  IST  )

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఇవాళ ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

రేపు అజిత్‌ పవార్‌ అంత్యక్రియలు.. హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ (NCP) అధినేత అజిత్ పవార్ (Ajith Pawar) ఇవాళ ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన అంతిమ సంస్కారాలను స్వస్థలమైన బారామతిలో గురువారం ఉదయం 11 గంటలకు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. అప్పటి వరకు పార్థివ దేహాన్ని సందర్శకుల దర్శనార్థం విద్యా ప్రతిష్ఠాన్ మైదనంలో పెట్టనున్నారు.

కాగా, అజిత్ పవార్ అంతిమ సంస్కారాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో పాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) స్వయంగా హాజరై నివాళులర్పించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే బారామతి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతికి గౌరవార్థం మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.

MORE NEWS : ప్రమాదానికి ముందు ఫ్లైట్‌లో అజిత్ పవార్ చివరి ఫొటో ఇదే.. సోషల్ మీడియాలో వైరల్

Next Story