- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదానికి ముందు ఫ్లైట్‌లో అజిత్ పవార్ చివరి ఫొటో ఇదే.. సోషల్ మీడియాలో వైరల్
బారామతి విమాన ప్రమాదం మహారాష్ట్ర ప్రజల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.

దిశ, వెబ్‌డెస్క్: బారామతి (Baramati) విమాన ప్రమాదం మహారాష్ట్ర ప్రజల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajith Pawar)తో పాటు భద్రతా సిబ్బంది ప్రదీప్ జాదవ్, ఎయిర్ హోస్టెస్ పింకీ మాలి, పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్, కో-పైలట్ శాంభవి పాఠక్ దుర్మరణం పాలయ్యారు. ఇవాళ ఉదయం సుమారు 8:10 గంటలకు అజిత్ పవార్ తన సిబ్బందితో కలిసి ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి బయలుదేరారు. అయితే, ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు అజిత్ పవార్ తన బాడీగార్డ్ ప్రదీప్ జాదవ్‌తో కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో అజిత్ పవార్ తెల్లని కుర్తా ధరించి, పైన ముదురు గులాబీ రంగు జాకెట్ వేసుకున్నారు. అదేవిధంగా ఎడమ చేతికి నలుపు రంగు పట్టి ఉన్న వాచ్, కళ్లజోడు ధరించారు. ఆ ఆనవాళ్ల ఆధారంగానే ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు, స్థానికులు తీవ్రంగా గాయపడింది అజిత్ పవార్‌గా నిర్ధారించారు.






