- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరోసారి ఏసీబీ దాడుల కలకలం
తెలంగాణలో ఏసీబీ (ACB) సంచలనం.. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇళ్లపై ఏకకాలంలో 10 చోట్ల దాడులు, సోదాలు!

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వరుస ఏసీబీ దాడులు (ACB raids) జరుగుతూ వందల కోట్ల అక్రమాస్తులు బయటపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే నమ్మదగిన సమాచారంతో, ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారుజామునే అధికారులు రంగంలోకి దిగారు. దీంతో సూపరింటెండెంట్ మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఏక కాలంలో 10 ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తున్నారు. కాగా ఈ ఏసీబీ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టీచర్ల నియామకం కుంభకోణం.. రాష్ట్రవ్యాప్తంగా ఈడీ దాడులు
Next Story






