- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్లకు తుపాకీ గురిపెట్టి బలవంతం చేయడం లేదు కదా.. నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హీరోయిన్లకు తమ పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛ ఉండదని చాలామంది అంటుంటారు.. కానీ నేను దానితో ఏకీభవించను.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. అయితే ఈ సినిమా విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలిచినప్పటికీ.. వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్‌ను గ్లామర్ డాల్‌గా చూపించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో.. బుచ్చిబాబు క్షమాపణలు చెప్పడంతో పాటుగా పలు సన్నీవేశాల విషయంలో మార్పులు కూడా చేశారు. అయితే ఈక్రమంలోనే హీరోయిన్లకు తమ పాత్రను ఎంచుకునే స్వేచ్ఛ ఉండదని ఎంతోమంది నటీమణులు గలమెత్తారు. తమకు మాట్లాడే హక్కుల కూడా ఉండదని.. మొత్తం దర్శకనిర్మాతలదే తప్పు అనే విధంగా కొందరు హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా పోస్టులు కూడా పెట్టి జాన్వీకి మద్దతుగా నిలిచారు.
అయితే ఇంత జరిగినా కానీ జాన్వీ మాత్రం ఈ వివాదంపై సైలెంట్‌గా ఉంది. తన పని తాను చేసుకుంటూ.. పోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టాలీవుడ్ దర్శకురాలు నందిని రెడ్డి హీరోయిన్లకు పాత్రను ఎంచుకునే స్వేచ్ఛ ఉండదనే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘హీరోయిన్లకు తమ పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛ ఉండదని చాలామంది అంటుంటారు.. కానీ నేను దానితో ఏకీభవించను. ఏదైనా పాత్ర పట్ల సౌకర్యంగా లేనప్పుడు చాలా మంది హీరోయిన్స్ బహిరంగంగానే అవకాశాలను తిరస్కరించడం మనం చూశాం. కథా చర్చల సమయంలోనే పాత్రకు సంబంధించిన ప్రతి అంశం వివరించబడుతుంది, ఆ తర్వాతే వారు ఆ సినిమాలో నటించడానికి అంగీకరిస్తారు. కాబట్టి, దీనికి పూర్తిగా చిత్ర నిర్మాతలనే నిందించడం సరికాదు. వారు తమ సొంత నిర్ణయంతోనే పారితోషికం తీసుకుని నటిస్తున్నారు.. ఎవరూ వారిని తుపాకీ గురిపెట్టి బలవంతం చేయడం లేదు కదా." అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.






