- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లివ్ ఇన్ రిలేషన్, రూ.లక్షల అప్పులు.. కట్‌చేస్తే ఫ్యామిలీనే లేపేసిన కూతురు
కూతురి లివ్ ఇన్ రిలేషన్ ను కాదన్నారన్న కోపంతో.. సొంత తల్లిదండ్రులు, చెల్లెలినే చంపేసిందో ఘనురాలు.

దిశ, వెబ్‌డెస్క్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అపార్ట్మెంట్ లో అత్యంత దారుణంగా హత్యకు గురికావడం బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది. సోమవారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సోమసుందర్ (55), అతని భార్య ముత్తులక్ష్మి (48), చిన్నకూతురు సుప్రియ (20)లను సొంతకూతురే కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. కేఆర్ పురం పీఎస్ పరిధిలోని సీగేహళ్లి, ధమనిక్ లేఅవుట్లో ఉన్న సాయి గ్రీన్ అపార్ట్మెంట్లో ఈ దారుణం చోటుచేసుకోగా.. స్థానికులు ఈ ఘోరకలిని చూసి ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టమ్ కు తరలించారు. కాగా.. వారి పెద్దకూతురైన శ్వేత తన ప్రియుడు కెన్నెత్ తో కలిసి ఈ ముగ్గురినీ చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉండటమే పోలీసుల అనుమానానికి కారణమయింది.
పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం చూస్తే.. శ్వేత - కెన్నెత్ లు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. దీనిపై శ్వేత తల్లిదండ్రులు అబ్జెక్షన్ చెప్పారు. పైగా శ్వేత దాదాపు రూ.30 లక్షల వరకూ అప్పులు చేసినట్లు సమాచారం. ఈ విషయమై తరచూ ఆమెను పేరెంట్స్ నిలదీస్తుండటంతో గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే సోమవారం.. తండ్రి, చెల్లెలు ఇంట్లో లేని సమయంలో శ్వేత, కెన్నెత్ లు అపార్ట్మెంట్ కు వెళ్లి.. ఒంటరిగా ఉన్న తల్లితో గొడవ పడ్డారు. అది కాస్తా తీవ్రం కావడంతో పదునైన ఆయుధంతో ఆమెను అక్కడే పొడిచి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. అనంతరం బాత్రూమ్ లో రక్తపు మరకలను కడిగి.. తండ్రి, చెల్లెలి కోసం కాపు కాశారు.
కాసేపటికి సుప్రియ ఇంటికి రాగా.. శ్వేత ఆమెను గట్టిగా పట్టుకుంది. కెన్నెత్ అదే ఆయుధంతో దాడిచేసి చంపినట్లు పోలీసులు అంచనా వేశారు. ఆ తర్వాత తండ్రి సోమసుందర్ రాగా ఆయనపైనా అదే ఆయుధంతో దాడి చేశారు. తీవ్ర గాయాలైనప్పటికీ సోమసుందర్ ప్రాణభయంతో ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం కోసం అర్ధించారు. కానీ తీవ్ర రక్తస్రావం కావడం వల్ల ఆయన కాసేపటికే మరణించారు. సమాచారం అందుకున్న కేఆర్ పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఈస్ట్ పాయింట్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నా, పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. పరారీలో ఉన్న శ్వేత, కెన్నెత్ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.






