- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : గూగుల్‌లో కొత్త ఫీచర్.. reCAPTCHAతో ప్రైవసీ ప్రొటెక్షన్!
గూగుల్ ఇప్పుడు reCAPTCHA హ్యాండ్ జెస్చర్ వెరిఫికేషన్ ఫీచర్‌ను రోల్ అవుట్ చేసింది.

దిశ, ఫీచర్స్ : గూగుల్ సెర్చింగ్‌లో ప్రైవసీ ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయా? ఫేక్ ట్రాఫిక్ పెరగడంవల్ల ఇబ్బందులు పడుతున్నారా? ఇక నుంచి అటువంటి సమస్యలు ఉండకపోవచ్చు. ఎందుకంటే.. గూగుల్ ఇప్పుడు reCAPTCHA చేతి సంజ్ఞ వెరిఫికేషన్(reCAPTCHA Hand Gesture Verification) అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. జూన్16-19 మధ్య నుంచి ఈ టెస్టింగ్ ప్రక్రియకు సంబంధించిన రోల్ అవుట్ ప్రారంభం కాగా ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. కాకపోతే త్వరలో రావచ్చునని నిపుణులు అంటున్నారు. అయితే హ్యాండ్ జెస్చర్ వెరిఫికేషన్ ఎలా పనిచేస్తుంది? దానివల్ల యూజర్లకు కలిగే భద్రత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ ప్రవేశ పెట్టిన reCAPTCHA సిస్టమ్‌లో హ్యాండ్ జెస్చర్ (Hand Gesture ) ఆధారిత వెరిఫికేషన్ టూల్ యూజర్ ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేయబడింది. ఇటీవల పలు రకాల చాట్ బాట్స్ సాంప్రదాయ ఇమేజ్ పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం, ఫేక్ ట్రాఫిక్ పెరగడం వంటి కారణాలతో ఆన్‌లైన్ వెరిఫికేషన్ పద్ధతులు మారుతున్నాయి. ఇలాంటప్పుడు ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూస్ సైతం తలెత్తుతున్నాయి. అలా జరగకుండా ఉండటంలో ఈ రీక్యాప్చ సమర్థవంతంగా పనిచేగలదని నిపుణులు అంటున్నారు.
ఎలా పనిచేస్తుంది?
రీక్యాప్చ ఫీచర్‌ను ఉపయోగించేం ముందు సంబంధిత బ్రౌజర్‌కు సంబంధించిన కెమెరా యాక్సెస్ అడుగుతుంది. తర్వాత యూజర్ చేతిని కెమెరా ముందు చూపించి సింపుల్ జెస్చర్స్ (చేతి కదలికలు లేదా వేవ్) చేయాలి. ఈ సందర్భంగా షార్ట్ వీడియో రికార్డ్ అవుతుంది. గూగుల్ MediaPipe AI ఉపయోగించి చేతి 21 నకిల్స్ (కీళ్ల) పాయింట్లను ఎక్స్‌ట్రాక్ట్ చేసి మానవ ఉనికి (లైవ్‌నెస్) నిర్ధారిస్తుంది. అయితే ఇక్కడ యూజర్ ఆడియో రికార్డ్ చేయదు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇక వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే వీడియో డిలీట్ చేయబడుతుంది. అలాగే ఏ విధమైన ఇతర ఐడెంటిటీలతో లింక్ చేయడం గానీ, ఇతర ప్రయోజనాలకు వినియోగించడం కానీ గూగుల్ చేయదు. ఎందుకంటే ఇది కేవలం యూజర్ ప్రైవసీ, అలాగే బాట్స్ నుంచి నిజమైన యూజర్లను వేరు చేయడానికి గోప్యతా దృక్పథంతో తీసుకొస్తున్న కొత్త ప్రయత్నం మాత్రమే. పైగా ఇక్కడ కెమెరా ఆధారిత వెరిఫికేషన్ వ్యవస్థ ఆన్‌లైన్ సెక్యూరిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుందని గూగుల్ చెబుతోంది.
ఏ బ్రౌజర్‌లో పనిచేస్తుంది?
రీక్యాప్చ ఫీచర్ కంప్యూటర్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ఫోన్.. ఇలా కెమెరా ఉన్న ప్రతీ పరికరంలో పనిచేస్తుంది. అయితే ముందుగా బ్రౌజర్ కెమెరా యాక్సెస్ అవ్వాలి. మొబైల్ ఫోన్లలో అయితే ఫ్రంట్ కెమెరా ఈజీగా ఉపయోగపడుతుంది. డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్‌లలో వెబ్‌క్యామ్ అవసరం. కెమెరా లేని లేదా లైటింగ్ సరిగా లేని పరికరాల్లో పని చేయకపోవచ్చు. ఇది ఆప్షనల్ కాబట్టి, సాధారణ ఇమేజ్ పజిల్స్ లేదా ఇతర పద్ధతులకు ఫాల్‌బ్యాక్ ఉంటుంది.
ప్రయోజనాలు
ఏఐ(AI) బాట్స్ సాంప్రదాయ ఇమేజ్ పజిల్స్‌ను సులభంగా పరిష్కరించడం వల్ల రీక్యాప్చ అనే ఈ కొత్త పద్ధతి మెరుగైన భద్రత అందిస్తుంది. అలాగే ఆటోమేటెడ్ అకౌంట్ క్రియేషన్, క్రెడెన్షియల్ స్టఫింగ్, ఫేక్ ట్రాఫిక్ వంటి ఫ్రాడ్‌ను ఎక్కువగా నిరోధిస్తుంది. యూజర్ అనుభవంకూడా మెరుగుపడుతుంది. ఉదాహరణకు పజిల్స్ కంటే సింపుల్ జెస్చర్ కంఫర్ట్ ఫీల్ ఇస్తుంది. ప్రైవసీ దృక్పథంలో రూపొందించబడిన ఫీచర్ కాబట్టి సైబర్ ఎటాక్స్, డేటా లీక్స్, డేటా డిలీట్ వంటి ఇబ్బందులు తలెత్తవని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ కెమెరా యాక్సెస్ వల్ల ప్రైవసీ ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చుననే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. అలాంటి ఇబ్బందులేవీ తలెత్తకుండా భవిష్యత్తులో మెరుగైన భద్రతను దృష్టిలో పెట్టుకొని పకడ్బందీ మార్పులు చేయడంలో గూగుల్ నిమగ్నమై ఉందంటున్నారు నిపుణులు.






