- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్‌స్టాగ్రామ్‌లో మరో న్యూ అప్‌డేట్.. ప్రతీ స్లైడ్‌కు విడి విడిగా అలా చేయొచ్చు!
ఇన్‌స్టాలో ఇప్పుడు మల్టిపుల్ ఫొటోలు, వీడియోలు ఉన్న పోస్ట్‌లో ప్రతీ దానికి విడి విడిగా క్యాప్షన్ జోడించవచ్చు.

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకూ ఆదరణ పెరుగుతున్న సోషల్ మీడియా వేదికల్లో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌తో అలరించడంలో దీని ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా యువతలో ఇది మస్తు పాపులర్ అయింది. అయితే రీసెంట్‌గా మరో అప్డేట్‌తో మన ముందుకొచ్చింది. ఏంటంటే.. ఇప్పుడు కారౌసెల్ ( Multiple Captions for Carousel) పోస్ట్.. అంటే మల్టిపుల్ ఫొటోలు లేదా వీడియోలు ఉన్న పోస్ట్‌లో ప్రతీ ఫొటో లేదా వీడియోకు విడి విడిగా క్యాప్షన్ జోడించవచ్చు. ఇంతకు ముందు అయితే కారౌసెల్ పోస్ట్‌కు ఒకే క్యాప్షన్ మాత్రమే వర్తించేది. కానీ.. ప్రస్తుతం ప్రతీ స్లైడ్‌కు ప్రత్యేకంగా క్యాప్షన్ ఇవ్వడం ద్వారా కంటెంట్ మరింత స్పష్టంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.
ఎలా పనిచేస్తుంది?
కారౌసెల్ పోస్ట్‌ను క్రియేట్ చేసేటప్పుడు ఫోటోలు/వీడియోలు అప్‌లోడ్ చేసిన తర్వాత “Add Caption” ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. ఇక్కడ Single Caption (పాత విధానం-ఒకే క్యాప్షన్) లేదా Multiple Captions (కొత్త ఆప్షన్) మధ్య ఎంపిక వస్తుంది. Multiple Captions ఎంచుకుంటే, కారౌసెల్‌లోని ప్రతీ స్లైడ్‌ను స్వైప్ చేసి దానికి సంబంధించిన ప్రత్యేక క్యాప్షన్ రాయవచ్చు. యూజర్లు స్వైప్ చేసినప్పుడు ఆ స్లైడ్‌కు సంబంధించిన క్యాప్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా రోల్ అవుట్ అవుతోంది.
ఉపయోగాలేమిటి?
ఈ కొత్త ఫీచర్ స్టోరీస్ చెప్పడంలో, ట్యుటోరియల్స్ షేర్ చేయడంలో, ప్రతీ స్లైడ్‌కు సందర్భం ఇవ్వడం వంటి వాటిని చాలా సులభతరం చేస్తుంది. ఉదాహరణకు ఫ్యాషన్ లుక్స్, రెసిపీ స్టెప్స్, ట్రావెల్ స్టోరీస్ లేదా ప్రొడక్ట్ రివ్యూస్ లాంటి కంటెంట్స్‌ను మరింత ఎఫెక్టివ్‌గా, అట్రాక్టివ్‌గా అందించవచ్చు. గతంకంటే కూడా స్టెప్-బై-స్టెప్ ట్యుటోరియల్స్, రెసిపీలు, ప్రొడక్ట్ గైడ్స్, ఫ్యాషన్ లుక్స్ వంటి కంటెంట్‌ను చాలా స్పష్టంగా షేర్ చేయవచ్చు. ప్రతీ స్లైడ్‌కు సందర్భం (context) ఇవ్వడం ద్వారా యూజర్లు ఎక్కువసేపు ఎంగేజ్ అవుతారు. ఇది పోస్ట్ రీచ్&ఎంగేజ్మెంట్‌ను కూడా పెంచుతుంది. కంటెంట్ క్రియేటర్లు, బిజినెస్ అకౌంట్లు, ఎడ్యుకేషన్ కంటెంట్ షేర్ చేసేవారికి ఇది చాలా ఉపయోగమని ఇన్‌స్టాగ్రామ్ పేర్కొన్నది. ఈ కొత్త ఫెసిలిటీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రోల్ అవుట్ అవుతోందని, కొన్ని రోజుల్లో అన్ని అకౌంట్లకు అందుబాటులోకి వస్తుందని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. ఇప్పటికే కొందరికి అందుబాటులోకి కూడా వచ్చింది. అయితే మీకు వచ్చిందో లేదో అనేది తెలియాలంటే.. యాప్‌ను అప్‌డేట్ చేసుకుని చెక్ చేసుకోవాలి.






