డబ్బులిస్తానంటే నాకు పదిమంది అయినా ఒకే.. రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

పేదరికం నుంచి తప్పించుకోవడం కోసం అవసరమైతే పది మంది మొగుళ్లనైనా మారుస్తాను.. అంతే కానీ మళ్లీ ఆ పేదరికంలోకి మాత్రం వెళ్లను" అంటూ చాలా ఓపెన్‌గా మాట్లాడారు.

డబ్బులిస్తానంటే నాకు పదిమంది అయినా ఒకే.. రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ రాఖీ సావంత్ ఎప్పుడూ తన వింత ప్రవర్తనతో, విచిత్రమైన మాటలతో నిలుస్తుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఖీ సంచలన వ్యాఖ్యలు.. చేసి మరోసారి సోషల్ మీడియాను షేక్ చేశారు. గతంలో రితేష్, ఆదిల్ ఖాన్ దుర్రానిలను పెళ్లి చేసుకుని, ఆ తర్వాత వారితో ఘోరంగా గొడవలు పడి విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిళ్ల గోడవలపై స్పందిస్తూ ఆమె డబ్బు, పేదరికం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి. తనకు పేదరికం అంటేనే విపరీతమైన అసహ్యమని రాఖీ సావంత్ స్పష్టం చేశారు. జీవితంలో మళ్లీ ఆ కష్టాల్లోకి వెళ్లడానికి తను అస్సలు సిద్ధంగా లేనని చెప్పారు. "నా ఆర్థిక పరిస్థితి బాగుండటం కోసం, పేదరికం నుంచి తప్పించుకోవడం కోసం అవసరమైతే పది మంది మొగుళ్లనైనా మారుస్తాను.. అంతే కానీ మళ్లీ ఆ పేదరికంలోకి మాత్రం వెళ్లను" అంటూ చాలా ఓపెన్‌గా మాట్లాడారు.

అంతేకాదు, నోట్ల కట్టలతో చేసిన బెడ్‌పై పడుకునేంత రేంజ్‌లో డబ్బు సంపాదించాలనేదే తన కోరిక అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక తన గ్లామర్, హెయిర్ సీక్రెట్ గురించి మాట్లాడుతూ.. తన తలపై ఉన్నవి రష్యన్ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అని, వాటి కోసం ఒక్కోసారికి ఏకంగా రూ. 12 లక్షల వరకు ఖర్చు పెడతానని చెప్పి అందరికీ మైండ్ బ్లాక్ చేశారు. అంతటితో ఆగకుండా డిప్రెషన్ (మానసిక ఒత్తిడి) గురించి మాట్లాడుతూ తనదైన శైలిలో వింత సమాధానం ఇచ్చారు. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు తాను వాడే టాబ్లెట్ల గురించి చెప్తూ.. మనీ టాన్, మనీ సింగ్ , మనీ సెటమాల్ అంటూ ఫన్నీగా చెప్పారు. అంటే డబ్బు అనే టాబ్లెట్ ఉంటే చాలు.. తనకు ఎలాంటి డిప్రెషన్ అయినా క్షణాల్లో మాయమైపోతుందని రాఖీ సావంత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story