ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

by Ajay Maddhiboyina |

దేశంలో ఈ మ‌ధ్య ఇసుక తుఫాన్లు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. తాజాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోనూ ఇసుక తుఫాన్ బీభ‌త్సం సృష్టించింది. మ‌ధ్యాహ్నం ఒక్క‌సారిగా ప‌లు ప్రాంతాల్లో వాతావ‌ర‌ణం మారిపోయింది.

ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశంలో ఈ మ‌ధ్య ఇసుక తుఫాన్లు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. తాజాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోనూ ఇసుక తుఫాన్ బీభ‌త్సం సృష్టించింది. మ‌ధ్యాహ్నం ఒక్క‌సారిగా ప‌లు ప్రాంతాల్లో వాతావ‌ర‌ణం మారిపోయింది. దీంతో చ‌త‌ర్ పూర్, ఆర్కేపురం, క‌ర్త‌వ్య‌ప‌థ్ ప్రాంతాలు దుమ్ము, ధూళితో నిండిపోయాయి. ఈ ప్రాంతాల్లో బ‌ల‌మైన గాల‌లు వీయ‌డంతో పాటు అక్క‌డ‌క్క‌డా వ‌ర్షం కురిసింది. దీంతో కంటిచూపు మేర వాహ‌నాలు కూడా క‌నిపించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇసుక తుఫాన్ ప్ర‌భావం యూపీ, రాజ‌స్థాన్ లోనూ కనిపించింది.

ఇక తుఫాన్ ఎఫెక్ట్ తో ఢిల్లీ విమానాశ్ర‌యంలో కొద్దిసేపు విమాన స‌ర్వీసులకు అంతరాయం ఏర్ప‌డింది. సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో మే, జూలై నెలల మధ్య ఇసుక తుఫాన్ లు వస్తుంటాయి. మేలో రాజస్థాన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇసుక తుఫాన్ ప్రభావం చూపించింది. దాదాపు అరగంట పాటు తుఫాన్ ప్రభావం ఉండటంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు బయపడిపోయారు. అరగంట తరవాత వర్షం కురవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తుఫాన్ దెబ్బకు భారీ వృక్షాలు సైతం నేల‌మ‌ట్టం అయ్యాయి.

Next Story