- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు గుడ్‌న్యూస్..అప్పటి వరకు విత్తన మేళాలు
జూన్ 23 నుంచి 30 వరకు విత్తన మేళాలు నిర్వహించనున్నట్లు కాటారం వ్యవసాయశాఖ వెల్లడించింది.

దిశ, కాటారం: జూన్ 23 నుంచి 30 వరకు విత్తన మేళాలు నిర్వహించనున్నట్లు కాటారం వ్యవసాయశాఖ వెల్లడించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహిస్తోంది. 'నాణ్యమైన విత్తనం అధిక దిగుబడికి పునాది' అనే లక్ష్యంతో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను కాటారం వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచుతోంది. వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేలా కార్యచరణను అమలు చేస్తోంది. పప్పు జాతి, నూనె గింజ పంటలను, చిరుధాన్యాలు, కూరగాయ పంటల సాగును ప్రోత్సహించే దిశగా అడుగులేస్తున్నది.
విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకుని నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను కొనుగోలు చేసి శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ అధికారిని పూర్ణిమ రైతులను కోరారు. ఈ కార్యక్రమానికి కాటారం సర్పంచ్ పంతకాని సడవలి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.






