- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్టపతి భవన్‌లో హిట్‌మ్యాన్ సందడి.. పద్మశ్రీ పురస్కారం అందుకున్న రోహిత్ శర్మ
టీమిండియా సక్సెస్‌ఫుల్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్, రోహిత్ శర్మ (Rohit Sharma)కు దేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఇవాళ సాయంత్రం అత్యంత వైభవంగా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ రెండో విడత కార్యక్రమంలో రోహిత్ శర్మ ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. క్రికెట్‌లో దేశానికి రోహిత్ అందించిన అసాధారణ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ అవార్డుతో సత్కరించింది. కాగా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2024లో బార్బడోస్ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అనంతరం దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలోనూ టీమిండియాను ఛాంపియన్‌గా నిలపడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
అదేవిధం వన్డే క్రికెట్ హిస్టరీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగులు సాధించిన రికార్డుతో పాటు ఏకంగా 3 డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్ శర్మ ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక ముద్ర వేశారు. గతంలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి పలువురు దిగ్గజ క్రికెటర్లు పద్మ పురస్కారాలను అందుకోగా.. ఇప్పుడు ఆ దిగ్గజాల సరసన రోహిత్ శర్మ కూడా చేరాడు,






