గాంధీ ఆస్పత్రిలో బాలింత మృతి..

by Batti.Sumithra |

బోయిన్‌పల్లి హస్మత్‌పేటకు చెందిన సమీనా బేగం (21) ప్రసవం కోసం గాంధీ ఆస్పత్రిలో చేరగా, మంగళవారం ఉదయం 5:30 గంటలకు మగ శిశువుకు జన్మనిచ్చింది.

గాంధీ ఆస్పత్రిలో బాలింత మృతి..
X

దిశ, సికింద్రాబాద్ : బోయిన్‌పల్లి హస్మత్‌పేటకు చెందిన సమీనా బేగం (21) ప్రసవం కోసం గాంధీ ఆస్పత్రిలో చేరగా, మంగళవారం ఉదయం 5:30 గంటలకు మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే సమీనా మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. డెలివరీ తర్వాత తగిన వైద్య సేవలు అందించలేదని, పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించలేదని వారు వాపోయారు. ఈ ఘటన పై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా సమీనా ప్రసవించిన నవజాత శిశువుకు ప్రస్తుతం నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలింత మృతికి గల కారణాల పై ఆస్పత్రి అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

Next Story