నా కొడుకులో ఓ మూర్ఖుడు ఉన్నాడు.. రాధా గాయత్రి మామ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన టెకీ రాధా గాయత్రి కేసులో విచారణ కొనసాగుతోంది. రాధా గాయత్రిని ఆమె భర్తనే చంపి డ్రామా ఆడుతున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

నా కొడుకులో ఓ మూర్ఖుడు ఉన్నాడు.. రాధా గాయత్రి మామ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన టెకీ రాధా గాయత్రి కేసులో విచారణ కొనసాగుతోంది. రాధా గాయత్రిని ఆమె భర్తనే చంపి డ్రామా ఆడుతున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తూ గాయత్రి తండ్రి ముస్సోరి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోస్టుమార్టం పూర్తి చేయగా రిపోర్ట్ వస్తే నిజాలు బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు. ఇక తాజాగా ఈ కేసుపై రాధాగాయత్రి భర్త శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కోడలు తనకు మంచి ఫ్రెండ్ అని ఆవేదన వ్యక్తం చేశారు.

తానే ఇంతలా బాధపడుతుంటే ఆమె తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అని అన్నారు. పేగు బంధం తెగితే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసని అన్నారు. ట్రాకర్ విషయంలో పదే పదే గొడవలు అయ్యాయని, శ్రీచరణ్ లో ఓ మూర్ఖుడు ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఆ విషయంలో శ్రీచరణ్ పై తాను చేయి చేసుకున్నది నిజమేనని చెప్పారు. వాళ్ల అత్త మామ ముందే తన కొడుకును కొట్టానని వ్యాఖ్యానించారు. శ్రీచరణ్ తనకు తాను పర్ఫెక్ట్ అనుకునేవాడని అదే అతడిలో మైనస్ అని అన్నారు. శ్రీచరణ్ చంపాడో లేదో తమకు తెలియదని కోర్టులు తేలుస్తాయని అన్నారు.

Next Story