VinFast: శ్రీరామ్ ఫైనాన్స్‌తో చేతులు కలిపిన విన్‌ఫాస్ట్

by S Gopi |

ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేశాయి.

VinFast: శ్రీరామ్ ఫైనాన్స్‌తో చేతులు కలిపిన విన్‌ఫాస్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) మార్కెట్లో విస్తరణ కోసం విన్‌ఫాస్ట్ ఇండియా కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దేశీయంగా కస్టమర్లకు రిటైల్ వాహన ఫైనాన్సింగ్‌ను సులభతరం చేయడానికి కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా విన్‌ఫాస్ట్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు 100 శాతం వరకు ఆన్-రోడ్ ఫండింగ్, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, అలాగే సౌకర్యవంతమైన ఈఎంఐ చెల్లింపు ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈవీ కొనుగోలును మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యంగా ఇరు కంపెనీలు తెలిపాయి. ఈ భాగస్వామ్యంతో శ్రీరామ్ ఫైనాన్స్‌కు దేశవ్యాప్తంగా ఉన్న విస్తృత నెట్‌వర్క్, పట్టణాలు, సెమీ-అర్బన్ ప్రాంతాలు, గ్రామీణ మార్కెట్లలో ఉన్న బలమైన కస్టమర్ బేస్‌ను విన్‌ఫాస్ట్ వినియోగించుకోనుంది. 'ఫైనాన్సింగ్ అడ్డంకులను తొలగించడం ద్వారా ఈవీ కొనుగోలు మరింత సులభతరం చేయడమే మా లక్ష్యమని విన్‌ఫాస్ట్ ఇండియా సీఈఓ తపన్ ఘోష్ తెలిపారు. గ్రీన్ మొబిలిటీ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ భాగస్వామ్యం కుదిరిందని శ్రీరామ్ గ్రీన్ ఫైనాన్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.

Next Story