- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులో 44వ హైవేపై మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

దిశ, భిక్కనూరు : రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులో 44వ హైవేపై మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... మెదక్ జిల్లా రామాయంపేట మండలం క్యాట్రాల గ్రామానికి చెందిన గడిల శ్యామయ్య భిక్కనూరు మండల కేంద్రంలో పని ముగించుకొని, తిరిగి తన స్వగ్రామానికి వెళుతుండగా జైకా హోటల్ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే దారిన వెళ్లేవారు 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో వారు జిఎంఆర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు జిఎంఆర్ సిబ్బంది ఘటన స్థలానికి వెంటనే చేరుకొని, కాలు విరిగి రోడ్డుపై పడిపోయిన శ్యామయ్యను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఎక్కించి కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు.






