- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు పెళ్లిళ్ల కి‘లేడీ’ పక్కా ట్రాప్.. వేధింపులు తాళలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
మూడు పెళ్లిళ్ల కిలాడీ ట్రాప్‌లో పడి ఓ రైల్వే ఉద్యోగి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మహిళా సంఘం నాయకురాలి ముసుగులో పరిచయమైంది. మ్యాట్రిమోని సైట్ కలిసి మాయమాటలు చెప్పి దగ్గరయింది. కట్ చేస్తే, మూడు పెళ్లిళ్ల గుట్టు దాచి మూడేళ్లు సహజీవనం చేసింది. చివరకు రూ.కోటి ఇన్సూరెన్స్ పాలసీ, రైల్వే ఉద్యోగ సర్వీస్ రికార్డే టార్గెట్‌గా ఆ కిలాడీ లేడి చేసిన బ్లాక్‌మెయిలింగ్, మానసిక వేధింపులు తట్టుకోలేక ఓ రైల్వే ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తిరుపతి జిల్లా రేణిగుంటలో వెలుగుచూసింది.
మ్యాట్రిమోనిలో గాలం.. మూడేళ్లు సహజీవనం
తూర్పుగోదావరి జిల్లా కడియం (Kadiyam) ప్రాంతానికి చెందిన రవి (Ravi) ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహిళా సంఘం నాయకురాలిగా చలామణి అవుతున్న ఉషారాణి (Usha Rani) అనే మహిళ మ్యాట్రిమోని సైట్ ద్వారా రవికి పరిచయమైంది. తన మాయమాటలతో రవిని ట్రాప్ చేసిన ఆమె, గత మూడేళ్లుగా అతనితో సహజీవనం సాగించింది. అయితే, ఉషారాణికి ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయ్యాయనే చేదు నిజాన్ని రవి ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఆమె అసలు స్వరూపం బయటపడటంతో రవి ఆమెకు దూరంగా ఉంటూ జాగ్రత్తపడటం ప్రారంభించాడు.
రూ.కోటి పాలసీ.. సర్వీస్ రికార్డే టార్గెట్
రవి తనను దూరం పెడుతున్నాడని గ్రహించిన ఉషారాణి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. రవికి ఉన్న రైల్వే సర్వీస్ రికార్డు (Railway Service Record)లో తన పేరును నామినిగా చేర్చాలని, అలాగే అతనికి ఉన్న రూ.1 కోటి విలువైన ఇన్సూరెన్స్ పాలసీకి కూడా తననే నామినిగా పెట్టాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసింది. ఒకవేళ నిరాకరిస్తే తప్పుడు కేసులు పెడతానని, సమాజంలో పరువు తీస్తానని బెదిరింపులకు పాల్పడింది. దీంతో బాధితుడు రవి ఉషారాణి వేధింపులు తట్టుకోలేక రేణిగుంట పోలీసుల (Renigunta Police)ను ఆశ్రయించాడు. ఆమెకు సంబంధించిన మూడు పెళ్లిళ్ల గుట్టు, ఆధార్ కార్డులు.. పక్కా ఆధారాలు అన్నీ సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది. మహిళా సంఘం, సీపీఐ (CPI) నాయకులతో మాట్లాడి రాజీ చేసుకోవాలంటూ పోలీసులు రవికి సలహా ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో తనకు న్యాయం జరగలేదని, తీవ్ర మనస్తాపానికి గురైన రవి ఇవాళ మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రవి సూసైడ్ నోట్‌లో షాకింగ్ నిజాలు..
రవి చనిపోయిన ఇంట్లో అతుడ రాసిన సూసైడ్ నోట్ (Suicide Note)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ఆత్మహత్యకు ఉషారాణి వేధింపులే కారణమని అందులో స్పష్టంగా పేర్కొన్నాడు. తనను మానసికంగా ఎలా వేధించింది, తప్పుడు కేసులతో ఎలా భయపెట్టింది అనే వివరాలన్నింటినీ లేఖలో వివరించాడు. మరోవైపు, ఉషా తనను వేధిస్తూనే మ్యాట్రిమోని సైట్లలో మరో పెళ్లి కోసం ఆన్‌లైన్‌లో గాలం వేసినట్లుగా మృతుడు రవి రాసి విషయాలు చూసి పోలీసులే విస్తుపోయారు. బాధితుడి కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు ఉషారాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.






