కస్తూర్బాకు దారెటు.. తికమక పడుతున్న పేరెంట్స్

by Batti.Sumithra |

గ్రామీణ వెనుకబడిన వర్గాల బాలికల విద్యకు కేంద్రాలైన కస్తూర్బా పాఠశాలలు నిర్వహనా లోపాలవల్ల విద్యార్థులు, తల్లితండ్రులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

కస్తూర్బాకు దారెటు.. తికమక పడుతున్న పేరెంట్స్
X

దిశ, చండూరు : గ్రామీణ వెనుకబడిన వర్గాల బాలికల విద్యకు కేంద్రాలైన కస్తూర్బా పాఠశాలలు నిర్వహనా లోపాలవల్ల విద్యార్థులు, తల్లితండ్రులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. చండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం కావటంతో చండూరుతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, తల్లితండ్రులు ఇక్కడకు వస్తున్నారు. ప్రధాన రహదారికి పక్కనే వున్న పాఠశాల పేరుకు సంబంధించిన బోర్డు లేకపోవటంతో పాఠశాల దొరకక పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపు సందర్బంగా కూడా విద్యార్థులు, తల్లితండ్రులు ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు. మండే ఎండలో పలువురిని పాఠశాల ఎక్కడ అని అడుగుతూ అటు ఇటు తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల నేమ్ బోర్డు ఏర్పాటు చేయటంలో నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Next Story