- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాదాపూర్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. నీట మునిగిన కాలనీలు
by Batti.Sumithra |
మాదాపూర్ సున్నం చెరువు సమీపంలో ఉన్న కాలనీలలో రాత్రి కురిసిన భారీ వర్షానికి భవనం సెల్లార్లలోకి నీరు చేరింది.

X
దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ సున్నం చెరువు సమీపంలో ఉన్న కాలనీలలో రాత్రి కురిసిన భారీ వర్షానికి భవనం సెల్లార్లలోకి నీరు చేరింది. సెల్లార్ లో ఉన్న కార్లు, బైకులు నీట మునిగాయి. ప్రధానంగా సున్నం చెరువుకు వెళ్లే వరదనీటి కాలువను హైడ్రా ఆధికారులు మూసివేయడంతో చెరువు సమీపంలో ఉన్న ఇంట్లోకి నీళ్లు చేరుతున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. అదేవిధంగా సెల్లార్ లో ఉన్న షాప్ లలో కూడా ఫ్రిజ్జులు ఎలక్ట్రికల్ వస్తువులు అన్ని నీట మునిగాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నీరు పోయే మార్గం అన్ని మూసుకుపోవడంతో కాలనీలను ముంచెత్తాయి. సెల్లార్ లోకి నీళ్లు చేరడం వలన ఉదయం వరకు ఇంట్లో ఉన్నవాళ్లు కిందికి రావడానికి ఇబ్బంది పడ్డారు. లింగంపల్లి తారనగర్ లో వర్షం నీరు ఇళ్లల్లోకి చేరి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Next Story






