సనత్‍నగర్ TIMSలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. పూర్తి వివరాలు ఇవే

by Prasad Jukanti |   (  Updated:2026-06-23 11:52:52  IST  )

సనత్ నగర్ టిమ్స్ లో టెక్నీషియన్, అడ్మినిస్ట్రేటివ్ ఖాళీల భర్తీ కోసం నిమ్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

సనత్‍నగర్ TIMSలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..  పూర్తి వివరాలు ఇవే
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌‌లోని సనత్ నగర్‌‌‌‌లో నిర్మించిన తెలంగాణ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రిని పూర్తిస్థాయిలో పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మౌలిక వసతులు చేసిన ప్రభుత్వం ఇక సిబ్బంది భర్తీపై ఫోకస్ పెట్టింది. టిమ్స్ హాస్పిటల్ పరిపాలనను అత్యున్నత ప్రమాణాలతో నడిపించేందుకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ భర్తీ బాధ్యతలను ప్రభుత్వం నిమ్స్ హాస్పిటల్‍కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో TIMSలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్/తాత్కాలిక ప్రాతిపదికన ఒక సంవత్సరం కాలపరిమితికి గాను టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ మరియు సపోర్ట్ సర్వీసెస్ విభాగాలలో మొత్తం 122 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

టెక్నీషియన్ పోస్టులు (మొత్తం: 98 ఖాళీలు)

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II: 34

అనస్థీషియా టెక్నీషియన్: 20

ఎక్స్-రే/సి-ఆర్మ్ టెక్నీషియన్ గ్రేడ్-II: 10

ఈసీజీ టెక్నీషియన్: 06

క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్: 06

బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ గ్రేడ్-II: 04

సీటీ టెక్నీషియన్ గ్రేడ్-II: 04

ఎమ్‌ఆర్‌ఐ టెక్నీషియన్: 04

సీఎస్‌ఎస్‌డీ (CSSD) టెక్నీషియన్: 04

ఈఈజీ టెక్నీషియన్ గ్రేడ్-II: 02

బయోమెడికల్ టెక్నీషియన్: 02

ఆడియోమెట్రీ టెక్నీషియన్: 01

ఆడియో విజువల్ టెక్నీషియన్: 01

అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు (మొత్తం: 24 ఖాళీలు)

సీనియర్ అసిస్టెంట్: 05

సూపర్‌వైజర్: 04

హెల్త్ ఇన్‌స్పెక్టర్: 04

అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 02

డెప్యూటీ రిజిస్ట్రార్ / డిప్యూటీ ఫైనాన్షియల్ కంట్రోలర్: 02

అసిస్టెంట్ రిజిస్ట్రార్ / అసిస్టెంట్ ఫైనాన్షియల్ కంట్రోలర్: 02

అకౌంటెంట్: 02

మెడికల్ రికార్డ్ ఆఫీసర్ (జూనియర్): 01

స్టాటిస్టీషియన్ (Statistician): 01

అకౌంట్స్ ఆఫీసర్ / ఫైనాన్షియల్ కంట్రోలర్: 01

అర్హతలు: వయోపరిమితి:

01.07.2026 నాటికి టెక్నికల్ పోస్టులకు 35 సంవత్సరాలు, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు 45 సంవత్సరాలు మించకూడదు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు & అనుభవం:

పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ/డిప్లొమా/పీజీతో పాటు కనీసం 1 నుండి 5 సంవత్సరాల పని అనుభవం (750 లేదా 500 బెడెడ్ ఆసుపత్రిలో) కలిగి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు:

జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 1,000/-, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 500గా నిర్ణయించారు. దీనిని డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో "The Director, NIMS, Hyderabad" పేరుతో చెల్లించాలి.

ఎంపిక విధానం:

అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 10 లోపు దరఖాస్తులు వస్తే నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 11 నుండి 30 లోపు దరఖాస్తులు వస్తే మెరిట్ ఆధారంగా స్క్రీనింగ్ చేసి అనంతరం ఇంటర్వ్యూ చేస్తారు. 30 కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ:

అర్హత గల అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన అప్లికేషన్/CVతో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలపై సెల్ఫ్ అటెస్టేషన్ (స్వయంగా సంతకం) చేసి కవర్ పైన ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో స్పష్టంగా రాయాలి. ఆ కవర్‌ను 06 జూలై 2026 సాయంత్రం 4.00 గంటల లోపు కింద తెలిపిన చిరునామాకు చేరేలా పంపించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు నిమ్స్ అధికారిక వెబ్‌సైట్‌ https://nims.edu.in/NIMSWP/recruitment?tab=curr&rec_id=NDIz సంప్రదించవచ్చు.

Next Story