- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల సంక్షేమానికి సాధికారతకు ప్రభుత్వం కృషి
మహిళల సంక్షేమానికి, ఆర్థిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ , కాప్రా: మహిళల సంక్షేమానికి, ఆర్థిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కుషాయిగూడ లక్ష్మీ కన్వెన్షన్ లో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలు ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆర్టీసీలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో అద్దె బస్సుల సేవలు, తదితర అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు.
ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల ఆశీర్వాదం కాంగ్రెస్ ప్రభుత్వం పై పూర్తిస్థాయిలో ఉందని, భవిష్యత్తులో కూడా మహిళలకు పెద్దపీట వేసే పరంపర కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ బోగడపు దయానంద్, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి , మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, తదితర అధికారుల బృందంతో కలిసి పట్నం మహేందర్ రెడ్డి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు రవీందర్ సాగర్, నిత్యానంద్, శైలజ, జకియా సుల్తానా, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






