సుహాసన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరం

by velandi.Saikiran |

కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కూచుకుళ్ళ సుహాసన్ రెడ్డి ఉచిత మెగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

సుహాసన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరం
X

దిశ, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కూచుకుళ్ళ సుహాసన్ రెడ్డి ఉచిత మెగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ప్రారంభించి సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. నా బర్త్ డే సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన కూచుకుళ్ళ సువాసన రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. ఇలాంటి ఉచిత వైద్య మెగా శిబిరాలు పేదలకు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మెగా వైద్య శిబిరం అగస్త్య హాస్పిటల్ వైద్య బృందంతో విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు ఆలయంలో పూజలు నిర్వహించి ముఖ్య భారీ ఎత్తున ఏర్పాటు చేసిన బర్త్డే కేకును కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గుండ్లపల్లి హరీశ్వర్ రెడ్డి ,,వీరేందర్, నాయకులు గోవింద నాయక్, ఈమె తండా సర్పంచ్ రామచందర్ నాయక్ ముమ్మాయిపల్లి ఉపసర్పంచ్ రాము, చిన్న పేరు సర్పంచ్ మునీందర్ నాయక్ తో పాటు దితరులు పాల్గొన్నారు.

Next Story