- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు పండిత్ లేక పదో తరగతి విద్యార్థుల ఆందోళన
by velandi.Saikiran |
జూలపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిత్ పోస్టు గత ఏడాది మొత్తం ఖాళీగా ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

X
దిశ, మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండలం జూలపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిత్ పోస్టు గత ఏడాది మొత్తం ఖాళీగా ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదో తరగతి విద్యార్థులకు తెలుగు సబ్జెక్టు అత్యంత కీలకమైనది. అయితే గత విద్యా సంవత్సరంలో పాఠశాలలో తెలుగు పండిత్ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు పండిత్ లేకపోవడంతో పాఠశాలలోని పీడీ అదనపు బాధ్యతగా తెలుగు బోధించినప్పటికీ, అది పూర్తిస్థాయి పరిష్కారంగా మారలేదని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) దృష్టికి తీసుకెళ్లగా, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






